Shivani: అదంతా జరిగిపోయింది .. ఇప్పుడంతా ఓకే: శివాని రాజశేఖర్

Shivani Rajasekhar Interview
  • విడుదలకి రెడీ అవుతున్న కోట బొమ్మాళి పీఎస్'
  • గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన సినిమా ఇది 
  • మలయాళ మూవీ 'నాయట్టు'కు ఇది రీమేక్ 
  • ముఖ్యమైన పాత్రను పోషించిన శివాని

మలయాళంలో 2021లో వచ్చిన 'నాయట్టు' సినిమాకి రీమేక్ గా, 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, తేజ మార్ని దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. "గతంలో జరిగిన కొన్ని సంఘటనలను చూసుకుంటే మీరు గీతా ఆర్ట్స్ 2లో చేయడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .. మీరెలా ఫీలవుతున్నారు?" అనే ప్రశ్న శివానికి ఎదురైంది. 

అందుకు ఆమె స్పందిస్తూ .. "ఇక్కడ పర్సనల్ లైఫ్ వేరు .. ప్రొఫెషనల్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్ లో ఎవరి ఆలోచనలు .. అభిప్రాయాలు వారివి. ఏదో ఒక సందర్భంలో అపోహలు .. అపార్థాలు తలెత్తి ఉండొచ్చు. సినిమాగా చూసుకుంటే మేమంతా ఒక ఫ్యామిలీ. పర్సనల్ గా చూసుకున్నా కొట్టుకోవడం లాంటివేం జరగలేదు. కొన్ని జరిగాయి .. మాట్లాడేసుకున్నాం .. అంతా అయిపోయింది .. ఇప్పుడంతా ఓకే " అంటూ చెప్పింది.

Shivani
Rahul Vijay
Kota Bommali PS

More Telugu News