Swaroopanandendra Saraswati: కీలక ప్రకటన చేసిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

Sarada peetadhipathi Swaroopanandendra Saraswathi shifting to Hyderabad
  • నిన్న విశాఖ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు
  • వచ్చే ఏడాది హైదరాబాద్ కు మారుతున్నట్టు ప్రకటన
  • విశాఖ పీఠం బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి చూసుకుంటారని వెల్లడి
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను హైదరాబాద్ కు మకాం మార్చనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న పీఠంలో ఉంటానని చెప్పారు. విశాఖ శారదాపీఠం బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి చూసుకుంటారని తెలిపారు. నిన్న విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. 

విశాఖలో ఇదే తన చివరి జన్మదినోత్సవమని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ లో జన్మదిన వేడుకలు జరుపుకుంటానని చెప్పారు. కోకాపేటలో నిర్మిస్తున్న ఆలయాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆదిశంకరుల అద్వైత తత్వంపై పరిశోధనలు నిర్వహిస్తామని... దీనికోసం రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Swaroopanandendra Saraswati
Sarada Peetam

More Telugu News