మరొక్క విజయం కోసం... ఫైనల్ ముంగిట టీమిండియా ప్రాక్టీస్... ఫొటోలు ఇవిగో!
- వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా, ఆసీస్
- ఈ నెల 19న అహ్మదాబాద్ లో టైటిల్ సమరం
- గత రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా
- నేడు మైదానంలో దిగి సాధన చేసిన ఆటగాళ్లు
ఈ నెల 19న టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పై నెగ్గి టీమిండియా... దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా... ఫైనల్ చేరుకున్నాయి.
2003 వరల్డ్ కప్ లోనూ టీమిండియా, ఆసీస్ ఫైనల్లో తలపడగా... దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఆసీస్ జట్టే విజేతగా నిలిచింది. ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. సొంతగడ్డపై ఆడుతుండడం టీమిండియాకు అదనపు బలం. ఏదేమైనా రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల్ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






