Ma Oori Polimera 2: నా స్వభావం ఎలాంటిదంటే .. 'పొలిమేర 2' హీరోయిన్ కామాక్షి భాస్కర్ల!

Kamakshi Bhaskarla Interview
  • చైనాలో మెడిసిన్ చేసిన కామాక్షి భాస్కర్ల 
  • ఆ తరువాత మోడలింగ్ దిశగా అడుగులు 
  • నటన పట్ల ఆసక్తితో సినిమాల వైపు 
  • మరింత పేరు తెచ్చిన 'మా ఊరి పొలిమేర 2'  

'మా ఊరి పొలిమేర 2' సినిమాలో 'లచ్చిమి' పాత్రను కామాక్షి భాస్కర్ల పోషించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె పోషించింది గ్రామీణ యువతి పాత్ర. ఆ సినిమా చూసిన ఎవరైనా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆర్టిస్ట్ అనే అనుకుంటారు.  అందువల్లనే ఆ పాత్రను అంత సహజంగా చేసిందని భావిస్తారు. 

కానీ కామాక్షి భాస్కర్ల చైనాలో మెడిసిన్ చేసింది. అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా కొంతకాలం పనిచేసింది. ఆ తరువాతనే ఆమె మోడలింగ్ పట్ల ఆసక్తితో అటువైపు వెళ్లి, అక్కడి నుంచి సినిమాల వైపు వచ్చింది. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. 

"నేను ఎవరితోను ఎక్కైవగా మాట్లాడను .. పార్టీలకు .. ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. నాకు బాగా పరిచయమైన వారితోనే కాస్త చనువుగా ఉండగలుగుతాను. నలుగురిలోకి చొచ్చుకుపోయే స్వభావం కాదు నాది. అందువల్లనే నేను ఇండస్ట్రీలో ఇమడలేనని నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. కానీ అలా ఉంటూనే ఇంతవరకూ వచ్చాను" అంటూ చెప్పుకొచ్చింది. 

  • Loading...

More Telugu News