Hardik Pandya: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌కూ పాండ్యా దూరం!

Hardik Pandya To Miss South Africa And Australia White Ball Series
  • గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన హార్దిక్
  • ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు దూరం
  • ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌
గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో రెండు నెలలపాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కూ దూరమవుతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌తోపాటు సౌతాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌కూ దూరం కానున్నట్టు తెలుస్తోంది. 

ప్రపంచకప్‌కు దూరం కావడంపై పాండ్యా ఇటీవల ఎక్స్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ జట్టుతోనే ఉంటానని, ప్రతి బంతికీ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన పాండ్యా స్థానంలో 27 ఏళ్ల ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.
Hardik Pandya
Team India
Team New Zealand
Sourth Africa

More Telugu News