Rajinikanth: వరల్డ్ కప్ ఎవరిదో చెప్పిన ప్రముఖ నటుడు రజనీకాంత్

  • ఇండియా × న్యూజిలాండ్ కోసం ముంబైకి వెళ్లిన రజనీకాంత్
  • గురువారం చెన్నైకి తిరిగొచ్చిన తలైవా
  • వరల్డ్ కప్‌ భారత్‌దేనని తేల్చి చెప్పిన రజనీ
Rajinikanth predicts india will win world cup

ఈ మారు భారత్ వరల్డ్ కప్‌ గెలిచి తీరుతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు రజనీకాంత్ సతీసమేతంగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ఆయన చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 

‘‘మ్యాచ్ (న్యూజిలాండ్‌తో..) తొలుత కాసేపు టెన్షన్‌గా అనిపించింది. ఒక్కో వికెట్ పడే కొద్దీ పరిస్థితి అనుకూలంగా మారింది. కానీ ఆ గంటన్నర సమయంలో మాత్రం చాలా టెన్షన్‌గా అనిపించింది. అయితే, ఈ సారీ ప్రపంచకప్ భారత్‌దే అని నమ్మకంగా చెప్పగలను’’ అని రజనీకాంత్ అన్నారు. 

ఈ ఏడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయ్యింది.

More Telugu News