Israel: హమాస్ అధినేత ఇంటిపై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు

Israeli Air Strike Destroys Home Of Hamas Leader Ismail Haniyeh
  • ఇజ్రాయెల్ దాడుల్లో ఇస్మాయిల్ హనియే ఇల్లు ధ్వంసం
  • 2006లో ప్రధానమంత్రి అయిన హనియే
  • 2017లో హమాస్ అధినేత అయిన వైనం
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే ఇంటిపై ఇజ్రాయెట్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో ఆయన ఇల్లు ధ్వంసమయింది. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది. హమాస్ అధినేతగా హనియేను పలు దేశాలు గుర్తించాయి. దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ స్పందిస్తూ హనియే నివాసం టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమని... ఇజ్రాయెల్ సైన్యం, ప్రజలపై టెర్రరిస్టు దాడులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయిని, ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని తెలిపింది.  

1990లలో ఇస్మాయిల్ హనియే లైమ్ లైట్ లోకి వచ్చారు. అప్పట్లో ఆయన హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ కు కుడిభుజంగా ఉన్నారు. 2004లో యాసిన్ హత్యకు గురయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో హమాస్ గ్రూపు గెలుపొందింది. హనియే ప్రధానమంత్రి అయ్యారు. 2017లో ఆయన హమాస్ అధినేత అయ్యారు.

Israel
Air Strikes
Hamas
Leader
Home

More Telugu News