Daggubati Purandeswari: కేంద్రం నిధులు ఇస్తున్నా ఏపీలో అభివృద్ధి జరగడం లేదు: పురందేశ్వరి

Purandeswari fires on YSRCP  Govt
  • ఏపీకి కేంద్రం ఎంతో ఆర్థిక సాయం చేస్తోందన్న పురందేశ్వరి
  • ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని విమర్శ
  • ఎయిమ్స్ కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని మండిపాటు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో సాయం చేస్తోందని... అయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ భవనాలకు, పరిశోధనలకు కేంద్రం నిధులను ఇచ్చిందని... అయినా ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని దుయ్యబట్టారు. యడ్లపాడు పార్కు అభివృద్ధి ఆగిపోయిందని, ఎయిమ్స్ కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

Daggubati Purandeswari
BJP
YSRCP

More Telugu News