Nana Patekar: యువకుడిపై చేయి చేసుకున్న నానా పటేకర్.. ఘటనపై వివరణ

Nana patekar issues clarification over him slapping a boy while taking selfie
  • నానా పటేకర్‌తో యువకుడు సెల్ఫీ దిగుతుండగా ఘటన
  • యువకుడి నెత్తిపై కొట్టిన నానా, నెట్టింట నటుడిపై విమర్శలు
  • అది కూడా షూటింగ్ సీన్ అనుకుని పొరబడ్డానంటూ నానా వివరణ
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిపై ఆయన చేయి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడి నెత్తిపై నానా కొట్టారు. ఆ తరువాత అక్కడ ఉన్న సిబ్బంది ఒకరు కుర్రాడి మెడపట్టి పక్కకు తీసుకెళ్లిపోయాడు. దీంతో, నానాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించావంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. నెట్టింట జనాగ్రహం వెల్లువెత్తుతుంటంతో నానా చివరకు స్పందించక తప్పలేదు. 

ఘటనపై తన వివరణతో నానా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ ఈ సీక్వెన్స్ సీన్‌లో భాగమే. మొదట ఓ రిహార్సెల్ చేశాము. రెండోది చేయాల్సి ఉంది. డైరెక్టర్ ప్రారంభించమన్నారు. మేము మొదలెట్టే సమయానికి ఆ కుర్రాడు వచ్చాడు. అతడెవరో నాకు తెలీదు. అతడు మా సిబ్బందిలో ఒకడని అనుకున్నా. కాబట్టి, సీన్ ప్రకారం అతడిని కొట్టి, వెళ్లిపొమ్మని చెప్పా. కానీ, అతడు బయటవాడని ఆ తరువాత తెలిసింది. కుర్రాడిని వెనక్కు పిలిపించే లోపే అతడు వెళ్లిపోయాడు. బహుశా ఇదంతా అతడి ఫ్రెండ్ రికార్డు చేసి ఉంటాడు. ఫొటో కోసం వచ్చే వారిని నేనెప్పుడూ కాదనలేదు. పొరపాటున ఇలా జరిగింది. నన్ను క్షమించండి. ఇలాంటి పని నేను ఎప్పుడూ చేయను’’ అని నానా అన్నారు.
Nana Patekar
Bollywood
Viral Videos

More Telugu News