Ponguleti Srinivas Reddy: 72 నుంచి 78 సీట్లలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti srinivas Reddy says congress will win around 72 seats
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని బీఆర్ఎస్ నేతలకు తెలుసునన్న పొంగులేటి
  • ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తోందన్న పొంగులేటి  
బీఆర్ఎస్ డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తోందని, కానీ తాము ప్రజలను నమ్ముకొని చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని అధికార బీఆర్ఎస్ నేతలకు తెలుసునని, అందుకే వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నది తాము కాదని, బీఆర్ఎస్ పార్టీయే అనీ అన్నారు. ఎవరు డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్ 72 నుంచి 78 సీట్లలో గెలిచి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Ponguleti Srinivas Reddy
BRS
Congress
Telangana Assembly Election

More Telugu News