Vellampalli Srinivasa Rao: చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు వెల్లంపల్లి సవాల్

Vellampalli challenge to Chandrababu Pawan Kalyan and Nara Lokesh
  • ఈ ముగ్గురూ దేనికీ పనికిరాని వ్యక్తులన్న వెల్లంపల్లి
  • దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని సవాల్
  • సామాన్యులు సంతోషంగా ఉంటే పవన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ కు పోటీ చేయడానికి నియోజకవర్గమే లేదని ఎద్దేవా చేశారు. వీళ్లు ముగ్గురూ దేనికీ పనికిరాని వ్యక్తులని విమర్శించారు. జగన్ పాలనలో సామాన్యులు సంతోషంగా బతుకుతున్నారని... సామాన్యులు మంచిగా ఉంటే పవన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. 

తమ ప్రభుత్వంలో ప్రతి పిల్లోడికి అమ్మఒడి ఇస్తున్నామని చెప్పారు. కక్కుర్తి పడే పద్ధతి తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని... ప్రతి రోజు 2 వేల నుంచి 3 వేల మంది వరకు వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని... ఈ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జగనన్న సురక్ష క్యాంపులను వెల్లంపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News