జైపూర్ కు మకాం మార్చిన సోనియా గాంధీ.. కారణం ఇదే!
- పొల్యూషన్ కారణంగా ఢిల్లీని వీడిన కాంగ్రెస్ మాజీ చీఫ్
- రాహుల్ గాంధీ, వేణుగోపాల్ తో కలిసి జైపూర్ ప్రయాణం
- రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు
- ఆరోగ్యం కోసమే సోనియా వచ్చారంటున్న పార్టీ నేతలు
సోనియా గాంధీ వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ లో జ్వరంతో, గత జనవరిలో శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఏటా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోతుండడంతో గతంలో కూడా సోనియా నగరాన్ని వీడారు. 2020లో ఇదే సీజన్ లో సోనియా గాంధీ గోవా వెళ్లారు. మరో ఏడాది హిమాచల్ ప్రదేశ్ లోని తన కూతురు ప్రియాంక గాంధీ ఇంటికి వెళ్లారు. కాగా, ప్రస్తుతం జైపూర్ లో ఉన్న సోనియా గాంధీ తిరిగి ఢిల్లీకి ఎప్పుడు వెళతారనే విషయంపై కాంగ్రెస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఢిల్లీలో కాలుష్యం తగ్గేంత వరకూ ఆమె జైపూర్ లోనే ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.