Subhman Gill: పెళ్లి చేసుకోబోతున్న సారా టెండూల్కర్ - శుభ్ మన్ గిల్!

News of Sara Tendulkar and Subhman Gill marriage going viral
  • సారా, గిల్ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు
  • ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ తాజాగా వార్తలు వైరల్
  • అధికారికంగా ఇంకా స్పందించని ఇరు కుటుంబాలు
టీమిండియా యువ స్టార్ బ్యాట్స్ మెన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ లో కూడా ఇండియా మ్యాచ్ లకు క్రమం తప్పకుండా సారా హాజరవుతోంది. గిల్ హాఫ్ సెంచరీ చేసినా, సెంచరీ కొట్టినా చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మరో వైపు తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనేదే ఆ వార్త. వీరి వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు చెపుతున్నారు. వరల్డ్ కప్ తర్వాత వీరి పెళ్లి ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఇటు సచిన్ కుటుంబం కానీ, అటు గిల్ ఫ్యామిలీ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Subhman Gill
Sara Tendulkar
Sachin Tendulkar
Marriage
Team India
Love

More Telugu News