Andhra Cricket Association: భారత్ × న్యూజిలాండ్ సెమీస్.. ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్‌లపై ప్రదర్శన

ACA arranges screen in ap for India newzealand match
  • ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్స్ 
  • పది వేల మంది ఒకేసారి చూసేలా ఏర్పాట్లు
బుధవారం జరగబోయే భారత్ × న్యూజిలాండ్ తొలి సెమీస్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ఈ అద్భుత పోరాటాన్ని లైవ్‌లో చూపించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను ప్రదర్శించనున్నారు. 

విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశం కూడా ఉచితమేనని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.30కి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మొదలు కానున్న విషయం తెలిసిందే.
Andhra Cricket Association
Andhra Pradesh
Vizag
Vijayawada
Kadapa District

More Telugu News