Anantha padmanabhaswamy temple: అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి

Another Crocodile appears in Anantha padmanabha swamy temple
  • శాకాహార మొసలి బబియా మరణించిన ఏడాదికి మరో మొసలి ప్రత్యక్షం
  • నవంబర్ 8న మొసలిని గుర్తించి, అధికారులకు సమాచారమిచ్చిన భక్తులు
  • ఒక మొసలి పోయాక మరొకటి రావడం పరిపాటిగా మారిందన్న అధికారులు
  • ఇలా వచ్చిన మూడో మొసలి బబియా అని వెల్లడి

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో శాకాహార మొసలి ‘బబియా’ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, ఇది మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది. నవంబర్ 8న కొందరు భక్తులు కొలనులో ఈ మొసలిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తాము ఆలయ పూజారికి చెప్పామని అధికారులు తెలిపారు. ఒక మొసలి చనిపోయిన తరువాత మరో మొసలి కొలనులోకి రావడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఇప్పుడు వచ్చిన మొసలి నాలుగవదని వివరించారు.

  • Loading...

More Telugu News