ISS: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి జారిపోయిన కిట్.. వీడియో ఇదిగో

Tool kit slipped from ISS orbiting earth
  • సోలార్ పరికరాలకు మరమ్మతులు చేస్తుండగా పట్టు జారిన టూల్ కిట్
  • ఐఎస్ఎస్ కంటే నాలుగు నిమిషాల ముందుగా పరిభ్రమిస్తున్న కిట్
  • 2024 మార్చిలో భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం

వ్యోమగాముల పట్టు నుంచి జారిపోయిన ఒక టూల్ కిట్ భూమి చుట్టూ తిరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే, లోల్ ఓ హార్, జాస్మిన్ మోఘ్ బెలీ ఈ నెల 1న స్పేస్ వాక్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు ఉన్న సోలార్ పరికరాలకు వారు మరమ్మతులు చేశారు. రిపేర్లు చేస్తున్న సమయంలో వారి పట్టు నుంచి టూల్ కిట్ జారిపోయింది. ఇది అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. ఆరోజు నుంచి అది తెల్లటి సంచి మాదిరి మెరుస్తూ... భూమి చుట్టూ తిరుగుతోంది. గత వారం ఫుజి పర్వతంపై నింగిలో తేలుతున్న ఈ కిట్ బ్యాగ్ ను జపనీస్ వ్యోమగాని సతోషి ఫురుకావా గుర్తించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంటే నాలుగు నిమిషాల ముందుగా ఇది భూమి చుట్టూ తిరుగుతోంది. కొన్ని నెలల పాటు ఈ బ్యాగ్ భూకక్ష్యలో తిరిగి, 2024 మార్చిలో భూ వాతావరణంలో ప్రవేశించి, మండిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఐఎస్ఎస్ కు ఎలాంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది.

  • Loading...

More Telugu News