Varun Tej: అత్తారింట్లో తొలి దీపావళి జరుపుకున్న లావణ్య త్రిపాఠి.. ఫొటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్

Lavanya Tripathi who celebrated her first Diwali in Varun Tej home
  • ప్రత్యేక దుస్తుల్లో మెరిసిపోయిన నూతన దంపతులు
  • కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. హైదరాబాద్‌లోని నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో నవదంపతులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లావణ్య అత్తారింట్లో తొలి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అనే ట్యాగ్‌తో వరుణ్ షేర్ చేసిన ఒక ఫొటోలో నూతన దంపతులు మెరిసిపోయారు. ఇద్దరూ చూడముచ్చటగా కనిపించారు.

ఇక మరో ఫొటోలో నాగబాబు కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా మెరిసిపోతూ కనిపించారు. వరుణ్ తేజ్ దంపతులతోపాటు నాగబాబు, ఆయన భార్య పద్మజ, కూతురు నిహారిక ఫొటోలో కనిపించారు. దీపావళి ప్రత్యేక దుస్తుల్లో కుటుంబ సభ్యులంతా సంతోషంగా కనిపించారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ ఫ్యాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలావుండగా ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరిగింది. అతిథుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

వరుణ్ ఇన్‌స్టా పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Loading...

More Telugu News