Balka Suman: తన వద్ద వందల కోట్లు ఉన్నాయన్న రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఫైర్

Balka Suman demands Revanth Reddy to prove that he as hundreds of crores
  • రేవంత్ కు వందల కోట్లు ఇచ్చి వివేక్ టికెట్ కొనుక్కున్నారన్న సుమన్
  • తన వద్ద వందల కోట్లు ఉన్నాయనే విషయాన్ని రేవంత్ నిరూపించాలని సవాల్
  • బీఆర్ఎస్ 80కి పైగా సీట్లలో గెలుస్తుందని ధీమా

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. బాల్క సుమన్ వద్ద వందల కోట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించడమే దీనికి కారణం. తన వద్ద వందల కోట్లు ఉన్నాయనే విషయాన్ని రేవంత్ నిరూపించాలని సుమన్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వందల కోట్లు ఇచ్చి చెన్నూరు కాంగ్రెస్ టికెట్ ను వివేక్ కొనుక్కున్నారని విమర్శించారు. వివేక్, వినోద్ వంటి వారు గెలిస్తే ఫ్యూడలిస్ట్ పాలన వస్తుందని అన్నారు. 

వివేక్ తండ్రి వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం వెంకటస్వామి తన ఇంటిని ఇచ్చారని... అయితే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివదేహాన్ని కూడా కార్యాలయంలోకి రానివ్వలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80కి పైగా సీట్లలో గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ... వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News