Jaishankar: కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను యూకే ప్రధాని రుషి సునాక్‌కి అందజేసిన విదేశాంగ మంత్రి జైశంకర్

External Affairs Minister Jaishankar presents bat signed by Virat Kohli to UK Prime Minister Rushi Sunak
  • జైశంకర్ దంపతులను అధికారిక నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన రుషి సునాక్
  • ప్రధాని మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జైశంకర్
  • వినాయకుడి విగ్రహం, విరాట్ సంతకం చేసిన బ్యాట్‌ను బహుమతులుగా అందించిన విదేశాంగమంత్రి
యూకే పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆ దేశ ప్రధానమంత్రి రుషి సునాక్‌ని కలిశారు. తన అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’కు విచ్చేసిన జైశంకర్‌ దంపతులను సునాక్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. సునాక్‌కు ప్రధాని మోదీ తరపున మంత్రి జైశంకర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహంతోపాటు ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను సునాక్‌కి బహుమతులుగా అందజేశారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా జైశంకర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు యూకే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. రుషి సునాక్, జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా మంత్రి జైశంకర్ వెంట ఆయన భార్య క్యోకో కూడా ఉన్నారు. వీరి యూకే పర్యటన నవంబర్ 15తో ముగియనుంది. యూకే విదేశాంగ సెక్రటరీ జేమ్స్‌ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులు జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
Jaishankar
Rishi Sunak
India
UK
Virat Kohli
Cricket

More Telugu News