Eatala Rajendar: అందుకే గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తున్నా: ఈటల

Eatala said why he contest against KCR
  • తాను కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడ్నంటూ ఈటల చమత్కారం
  • తానేమీ దిక్కులేక గజ్వేల్ కు రాలేదని వెల్లడి
  • కేసీఆర్ ను ఢీకొట్టేందుకే వచ్చానని స్పష్టీకరణ
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడ్నని చమత్కరించారు. తానేమీ దిక్కులేక గజ్వేల్ కు రాలేదని, కేసీఆర్ ను ఢీకొట్టేందుకే వచ్చానని, అందుకే ఆయనపై పోటీ చేస్తున్నానని వెల్లడించారు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే కేసీఆర్ ను ఎదుర్కొంటున్నానని తెలిపారు. 

ఈటల రాజేందర్ ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ పోటీ చేస్తున్నారు. తానేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఉద్యమంలో తాను పోషించిన పాత్రను ప్రజలు గుర్తించారని ఈటల పేర్కొన్నారు. 

మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు బీఆర్ఎస్ నుంచి అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన ఈటల... ఆ తర్వాత బీజేపీలో చేరడం, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలవడం తెలిసిందే. ఇప్పుడు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి గజ్వేల్ స్థానంపై పడింది. 

సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
Eatala Rajendar
KCR
Gajwel
BJP
BRS
Telangana

More Telugu News