Virat Kohli: కోహ్లీ ఆల్ రౌండర్... కీలక వికెట్ తీశాడు!

Kohli gets a wicket by dismissed Dutch skipper Scott Edwards
  • బెంగళూరులో టీమిండియా × నెదర్లాండ్స్
  • 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసిన టీమిండియా
  • లక్ష్యఛేదనలో 29 ఓవర్లలో 4 వికెట్లకు 135 రన్స్ చేసిన నెదర్లాండ్స్
  • నెదర్లాండ్స్ కెప్టెన్ ను అవుట్ చేసిన కోహ్లీ

టీమిండియా డైనమిక్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆల్ రౌండర్ అయిపోయాడు. ఇవాళ నెదర్లాండ్స్ తో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ... కోహ్లీకి బంతిని ఇచ్చాడు. తన స్లో మీడియం పేస్ తో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ను బోల్తా కొట్టించిన కోహ్లీ వికెట్ సాధించాడు. కోహ్లీ లెగ్ సైడ్ విసిరిన బంతిని ఆడబోయిన ఎడ్వర్డ్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ వికెట్ తీయడంతో మైదానం హోరెత్తిపోయింది. టీమిండియా సభ్యులు హర్షాతిరేకాలతో కోహ్లీని అభినందించారు. 

బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. 411 పరుగుల అతి భారీ లక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్  ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 135 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News