Kushal Mendis: మీడియా ఆ ప్రశ్న అడిగినప్పుడు కోహ్లీ 49వ సెంచరీ గురించి నాకు తెలియదు: కుశాల్ మెండిస్

Kushal Mendis explains what was his opinion on Kohli record
  • వన్డేల్లో 49 సెంచరీలు సాధించిన కోహ్లీ
  • సచిన్ టెండూల్కర్ రికార్డు సమం
  • దీనిపై తానెందుకు స్పందించాలన్న కుశాల్ మెండిస్
  • మెండిస్ తీరుపై విమర్శలు
  • చింతిస్తున్నానంటూ తాజాగా మెండిస్ ప్రకటన
పుట్టినరోజు నాడు విరాట్ కోహ్లీ 49వ సెంచరీ చేసి వన్డేల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేయడం తెలిసిందే. అయితే, ఇటీవల కోహ్లీ 49వ సెంచరీపై స్పందించాలని శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ కుశాల్ మెండిస్ ను మీడియా కోరగా... నేనెందుకు స్పందించాలంటూ కుశాల్ మెండిస్ బదులిచ్చాడు. దాంతో మెండిస్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

విమర్శల నేపథ్యంలో మెండిస్ తాజాగా వివరణ ఇచ్చాడు. "మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో, కోహ్లీ 49వ సెంచరీ చేశాడన్న విషయం నాకు తెలియదు. అయితే ఓ జర్నలిస్టు సడన్ గా అడగడంతో ఏం చెప్పాలో నాకు తెలియలేదు. అంతేకాదు, అతడు దేని గురించి అడుగుతున్నాడో కూడా అర్థం కాలేదు. ఏదేమైనా 49 సెంచరీలు సాధించడం మూమూలు విషయం కాదు. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే అందుకు చింతిస్తున్నాను" అని వెల్లడించాడు.
Kushal Mendis
Virat Kohli
49th Century
Record
Sachin Tendulkar
World Cup

More Telugu News