Palvai Sravanthi: మరో కాంగ్రెస్ కీలక నేత రాజీనామా!

Palvai sravanthi resigns from congress party
  • మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్
  • పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి
  • త్వరలో బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటన
మాజీ ఎంపీ, దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు కూడా ప్రకటించారు. అంతకుమునుపు, మనుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిని ప్రకటించడంతో ఆమె పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొట్టిపారేసిన స్రవంతి తాను కాంగ్రెస్‌లో ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం సంచలనంగా మారింది.
Palvai Sravanthi

More Telugu News