Megha Rani Agarwal: తనపై చేతబడి చేశారన్న బీజేపీ చార్మినార్ అభ్యర్థి మేఘారాణి.. రోడ్డుపై మేకులు ఏరిన పోలీసులు.. వీడియో ఇదిగో!

BJP Charminar Candidate Megha Rani Agarwal Alleges Black Magic On Her
  • నామినేషన్‌కు వెళ్తుండగా రోడ్డుపై మేకుల దర్శనం
  • నేరుగా ఎదుర్కోలేక ఇలా చేతబడితో కుట్రలు చేస్తున్నారని మేఘ ఆరోపణ
  • బీజేపీ నాయకురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
తనపై చేతబడి చేశారన్న బీజేపీ చార్మినార్ అభ్యర్థి మేఘారాణి అగర్వాల్ ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నామినేషన్ కోసం నిన్న కారులో బయలుదేరిన ఆమెకు దారిపొడవునా కుప్పలుగా మేకులు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన మేఘ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని, చేతబడితో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై మేకులు పోయడం ద్వారా తన వాహనానికి పంక్చర్ చేసి నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోడ్డుపై మేకులు చల్లిన ఘటనపై  మేఘ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Megha Rani Agarwal
BJP
Charminar
Black Magic

More Telugu News