CM Jagan: సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం

CM Jagan escapes unhurt in an incident
  • వేముల మండలంలో వైసీపీ నేతలతో సీఎం జగన్ సమీక్ష
  • ఇడుపులపాయకు వస్తుండగా కాన్వాయ్ లో అదుపుతప్పిన కారు
  • సీఎం జగన్ వాహనాన్ని ఢీకొట్టిన కారు
  • కుదుపులకు లోనై రెండు మూడు కార్లను ఢీకొట్టిన సీఎం జగన్ కారు

ఏపీ సీఎం జగన్ కు ఇవాళ ప్రమాదం తప్పింది. కడప జిల్లా వేముల మండలంలో వైసీపీ నేతలతో సమీక్ష అనంతరం సీఎం జగన్ ఇడుపులపాయకు తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. 

ఆయన కాన్వాయ్ లో ఓ కారు అదుపుతప్పింది. ఆ కారు సీఎం జగన్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో... జగన్ కారు బలమైన కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో సీఎం జగన్ కారు కూడా అదుపు తప్పి కాన్వాయ్ లోని రెండు మూడు కార్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. దాంతో ఆయా కార్లు కొద్ది మేర దెబ్బతిన్నాయి. 

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సీఎం జగన్ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం సీఎం జగన్ మరో కారులో ఇడుపులపాయ వెళ్లిపోయారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో సీఎం జగన్ కు ముప్పు తప్పిందని భావిస్తున్నారు. 

సీఎం జగన్ గత రెండ్రోజులుగా అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించారు. ఇవాళ కూడా కడప జిల్లాలో పలు  పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News