Congress: చివరి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Telangana Congress Released Final List Of Candidates
  • ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితా విడుదల
  • రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి సూర్యాపేట
  • ముజీబుల్లాకు చార్మినార్ టికెట్ కేటాయింపు
  • నిన్నటి వరకు మొత్తం 2,265 నామినేషన్ల దాఖలు
తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం నేటితో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో.. పటాన్‌చెరు నుంచి కట్టా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్లు కేటాయించింది. 

నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థులు తమ పత్రాలతో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. 13వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా, 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న పోలింగ్ జరుగనుండగా డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. నిన్న ఒక్కరోజే 1077 నామినేషన్ల దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తం 2,265 నామినేషన్లు వచ్చాయి.
Congress
TPCC
AICC
Telangana Assembly Election

More Telugu News