Biyyapu Madhusudan Reddy: దసరా పులి డ్యాన్సుతో అదరగొట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!

Srikalahasti MLA Biyyapu Madhusudan Reddy dance went viral
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్యక్రమం
  • ప్రధాన ఆకర్షణగా దసరా పులి వేషగాళ్లు
  • తప్పెట్ల మోతకు ఉత్సాహంగా కాలు కదిపిన బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, వైసీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో దసరా పులి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఓ ఊరేగింపులో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి తప్పెట్ల మోతకు ఉత్సాహంగా కాలు కదిపారు. కొందరు కళాకారులు పులివేషాలు వేసుకుని డ్యాన్స్ చేస్తుండగా, ఎమ్మెల్యే కూడా హుషారుగా రంగంలోకి దిగారు. తప్పెట్ల మోతకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. పులి వేషం ఒక్కటే తక్కువ గానీ, ఆయన కళాకారులకు తీసిపోని రీతిలో డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.
Biyyapu Madhusudan Reddy
Tiger Dance
Srikalahasti
YSRCP

More Telugu News