Kesineni Nani: కుటుంబ సభ్యులతో కలిసి ధర్మశాల క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన కేశినేని నాని... ఫొటోలు ఇవిగో!

TDP MP Kesineni Nani visits Dharmashala cricket stadium with family members
  • హిమాచల్ ప్రదేశ్ లో ఎంపీ కేశినేని నాని పర్యటన
  • ధర్మశాల స్టేడియం సందర్శన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న టీడీపీ ఎంపీ
  • ఇక్కడి క్రికెట్ అనుభూతి మరెక్కడా లభించదని వెల్లడి 
టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి  హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియం నుంచి కనిపిస్తున్న హిమాలయ పర్వతాల అందాలను ఎంతో అపురూపంగా వీక్షించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

"సమున్నతమైన హిమాలయ పర్వత శ్రేణి నడుమ కొలువుదీరిన ధర్మశాల క్రికెట్ స్టేడియంను సందర్శించాం. సముద్ర మట్టం నుంచి చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన క్రికెట్ స్టేడియం. మంచుతో కప్పేసిన పర్వత శిఖరాలు, పచ్చదనం సంతరించుకున్న గిరులు, విసురుగా వీచే కొండ గాలి నడుమ ధర్మశాల స్టేడియంలో లభించే క్రికెట్ అనుభూతి మరెక్కడా దొరకదు. మీరు క్రికెట్ అభిమాని అయినా, ప్రకృతి ప్రేమికుడు అయినా సరే... ఇక్కడి మాయలో పడిపోవాల్సిందే" అని కేశినేని నాని ఫేస్ బుక్ లో వివరించారు.
Kesineni Nani
Dharmashala
Cricket Stadium
Himalayas
Himachal Pradesh
TDP
Andhra Pradesh

More Telugu News