Allu Arjun: 'మంగళవారం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

Allu Arjun will grace Mangalavaaram movie pre release event
  • పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత నటించిన చిత్రం 'మంగళవారం'
  • అజయ్ భూపతి దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 11న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు 'మంగళవారం'
పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేత, దివ్యా పిళ్లై తదితరులు నటించిన చిత్రం 'మంగళవారం'. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, నవంబరు 11న సాయంత్రం 6 గంటల నుంచి 'మంగళవారం' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. హైదరాబాదులోని జేఆర్ సీ కన్వెన్షన్స్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వేదికగా నిలుస్తోంది. 

'మంగళవారం' చిత్రం నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రవణ్ రెడ్డి, సిరితేజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. 

గత నెలలో విడుదలైన 'మంగళవారం' ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది.
Allu Arjun
Mangalavaaram
Pre Release Event
Payal Rajput
Nanditha Swetha
Ajay Bhupathi

More Telugu News