Nani: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: నాని

Actor Nani response on Jai Bheem movie controversy
  • 'జైభీమ్' సినిమాకు జాతీయ అవార్డు రాలేదని నాని అసంతృప్తి
  • వివాదాస్పదమైన నాని ట్వీట్
  • తాను చూసిన ఉత్తమ చిత్రాల్లో 'జైభీమ్' కూడా ఒకటనే తాను చెప్పానన్న నాని
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'జై భీమ్'కు జాతీయ అవార్డు రాకపోవడంపై టాలీవుడ్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హార్ట్ బ్రేక్ ఎమోజీనీ ఆయన పోస్ట్ చేశారు. దీంతో, కొందరు నానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు హీరోలకు, సినిమాలకు అవార్డులు వస్తే అభినందించాల్సింది పోయి, తమిళ సినిమాకు అవార్డు రాలేదని బాధ పడుతున్నారని విమర్శిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై తాజాగా నాని స్పందిస్తూ... తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తెలుగు సినిమాలైన 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' సినిమాలకు అవార్డులు రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. తన సోదరుడు అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు. తాను చూసిన ఉత్తమ చిత్రాల్లో 'జైభీమ్' కూడా ఒకటని మాత్రమే తాను ట్వీట్ చేశానని చెప్పాడు. అందుకే హార్ట్ బ్రేక్ ఎమోజీని పెట్టానని వివరణ ఇచ్చారు.  

Nani
Tollywood
Jai Bheem

More Telugu News