cpi: కొత్తగూడెంలో సీపీఐకి షాక్... బీఆర్ఎస్‍‌లో చేరిన పార్టీ కౌన్సిలర్లు

CPI counsellors join brs in the presence of ktr
  • సీపీఐకీ రాజీనామా చేసిన పలువురు కౌన్సిలర్లు
  • కౌన్సిలర్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
  • సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి సహా పలువురి చేరిక
కొత్తగూడెంలో సీపీఐ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి పలువురు సీపీఐ కౌన్సిలర్లు రాజీనామా చేసి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి, మున్సిపల్‌ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరెడ్డి , ఒకటో వార్డు కౌన్సిలర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయ్ కుమార్, పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ చారి, పదహారో వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, ముప్పయ్యో వార్డు కౌన్సిలర్ నేరేళ్ల సమైక్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ పట్టణ కన్వీనర్ పిడుగు శ్రీనివాస్ తదితరులు పార్టీలో చేరారు.
cpi
BRS
KTR
Telangana Assembly Election

More Telugu News