Chandrababu: ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం: ఇసుక కేసులో హైకోర్టుకు తెలిపిన సీఐడీ

CID told AP High Court that they will not arrest Chandrababu until 28th
  • ఇసుక కేసులో ఏ2గా చంద్రబాబు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • తదుపరి విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేసిన హైకోర్టు

ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కేసులో చంద్రబాబును ఏ2గా సీఐడీ పేర్కొంది.

  • Loading...

More Telugu News