KCR: టేకాఫ్ అవ్వని ముఖ్యమంత్రి హెలికాప్టర్... రోడ్డు మార్గాన ఆసిఫాబాద్‌కు కేసీఆర్

CM KCR reaches Asifabad by road
  • మధ్యాహ్నం సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్
  • సిర్పూర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరగా టేకాఫ్ కాని వైనం
  • ఎన్నికల నేపథ్యంలో వరుసగా ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ మొరాయించింది. బుధవారం మధ్యాహ్నం ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అనంతరం ఆసిఫాబాద్ సభలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఆయన బయలుదేరారు. అయితే సిర్పూర్ కాగజ్ నగర్‌లో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్ వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జోరుగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న ఓటింగ్ ఉండగా, 28వ తేదీ వరకు ఆయన సభల్లో పాల్గొంటున్నారు.
KCR
BRS
Telangana Assembly Election

More Telugu News