Prabhas: ఇటలీ నుంచి తిరిగొచ్చిన ప్రభాస్.. ఫొటోలు వైరల్

Prabhas came back to Hyderabad
  • చాలా రోజుల క్రితం ఇటలీకి వెళ్లిన ప్రభాస్
  • కాలుకు సర్జరీ చేయించుకున్న వైనం
  • పూర్తి విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టారు. చాలా రోజుల క్రితం ప్రభాస్ ఇటలీకి వెళ్లారు. ఆయన కాలుకు సర్జరీ చేయించుకుని, అక్కడే పూర్తిగా విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రభాస్ బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో రెండు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. ఆ పాటలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
Prabhas
Tollywood
Bollywood

More Telugu News