Thummala: తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలు.. మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు

Police searches in Thummala Nageswar Rao home
  • ఖమ్మంలోని తుమ్మల నివాసంలో పోలీసుల సోదాలు
  • ప్రచారం కోసం తుమ్మల వెళ్లిన తర్వాత ఇంట్లోకి వచ్చిన పోలీసులు
  • ఆ సమయంలో ఇంట్లో ఉన్న తుమ్మల భార్య
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీలోని తుమ్మల నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం తుమ్మల తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తుమ్మల భార్యతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. మరోవైపు తుమ్మల నివాసంలో సోదాలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబడుతున్నాయి. 

Thummala
Congress
Residence
Police Searches

More Telugu News