కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న.. హస్తం పార్టీలో మరింత జోష్!
- మేడ్చల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన మల్లన్న
- మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న
- గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలోనే ఓట్లు తెచ్చుకున్న వైనం
మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్ లో చేరడం అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు హుజూర్ నగర్ ఉపఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయనకు పెద్ద సంఖ్యలోనే ఓట్లు పడ్డాయి.