Raghu Rama Krishna Raju: ఏఏజీ, సీఐడీ చీఫ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో రఘురామ పిటిషన్

Raghurama files implead petition in AP High Court
  • ఏఏజీ, సీఐడీ చీఫ్ పై గతంలో హైకోర్టులో పిల్
  • దాఖలు చేసిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ
  • తన వాదనలు కూడా వినాలంటూ రఘురామ ఇంప్లీడ్ పిటిషన్

అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంపై గతంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణలో వాదనలు వినిపించేందుకు తనకు కూడా అవకాశం కల్పించాలని రఘురామ తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏఏజీ పొన్నవోలు, సీఐడీ చీఫ్ సంజయ్ నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ కేసుపై మీడియా సమావేశాలు నిర్వహించారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు.

  • Loading...

More Telugu News