World Cup: వరల్డ్ కప్: ఆసీస్ తో అమీతుమీ... టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్

Afghanistan won the toss against Australia
  • వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర మ్యాచ్
  • వాంఖెడే స్టేడియంలో ఆసీస్ × ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ 
వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. సెమీస్ బెర్తు ఊరిస్తున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఇరుజట్లకు సెమీస్ అవకాశాలు ఉండడంతో ఇవాళ హోరాహోరీ తప్పదనిపిస్తోంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలవనుంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ స్థానంలో నవీనుల్ హక్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్ స్థానంలో మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్ జట్టులోకి వచ్చారు. 

టోర్నీలో ఇప్పటివరకు ఆసీస్ జట్టు 7 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆఫ్ఘన్ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది.
World Cup
Australia
Afghanistan
Wankhede
Mumbai

More Telugu News