Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట

AP High Court orders CID not to arrest Chandrababu in inner ring road case
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా
  • అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. 

మరోవైపు వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ... స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని... ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు... అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.

Chandrababu
Telugudesam
Inner Ring Road Case
Bail
AP High Court

More Telugu News