Priyanka Gandhi: పువ్వులు లేకుండా బొకే ఇచ్చిన లీడర్.. నవ్వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో ఇదిగో!

Priyanka Gandhi Breaks Into Laughter As Congress Leader Hands Over Bouquet Without Flowers In Indore
  • అచ్చంగా బీజేపీ నేతలు ఇస్తున్న హామీల్లాగే ఉందంటూ తన ప్రసంగంలో వ్యంగ్యం
  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఎన్నికల ప్రచార సభలో ఘటన
  • వేదికపై నవ్వులు పూయించిన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీకి ఓ వింత అనుభవం ఎదురైంది. సభావేదికపై కాంగ్రెస్ నేత ఒకరు చేసిన పనికి ఆమె నవ్వాపుకోలేకపోయారు. ప్రియాంక నవ్వడంతో వేదికపై ఉన్న మిగతా లీడర్లతో పాటు సభకు హాజరైన జనం కూడా నవ్వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వేదికపైకి వచ్చిన ప్రియాంక గాంధీని స్వాగతించే క్రమంలో పార్టీ స్థానిక లీడర్ దేవేంద్ర యాదవ్ ఆమెకు బొకే అందజేశారు. దానిని అందుకున్న ప్రియాంక.. బొకేలో పువ్వులు లేకపోవడం చూసి ఇదేంటని అడుగుతూ నవ్వేశారు.

ఖాళీ బొకేను చూసిన మిగతా లీడర్లు కూడా ఆమె నవ్వుతో శ్రుతి కలిపారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ ప్రియాంక ఈ బొకే ఉదంతాన్ని ప్రస్తావించారు. తాను ఇంతకుముందే ఓ బొకే అందుకున్నానని చెప్పారు. అది అచ్చంగా బీజేపీ లీడర్లు ఇస్తున్న హామీల్లాగే ఖాళీగా ఉందని చెప్పడంతో జనం విరగబడి నవ్వారు. ఇండోర్ సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
Priyanka Gandhi
Congress
Bouquet
Without Flowers
Indore
Viral Videos

More Telugu News