tummala nageswara rao: 30 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారు: ఎన్నికల సంఘానికి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు

Thummala Nageswara Rao compliant to CEC
  • దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు తుమ్మల
  • ఇంటి నెంబర్ లేకుండానే ముప్పై వేల ఓట్లు నమోదు చేశారని ఆరోపణ
  • దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను ఈసీకి అందించిన మాజీ మంత్రి
దొంగ ఓట్ల నమోదుపై మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లను ఇంటి నెంబర్ లేకుండా నమోదు చేశారన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, సీఈవో తదితరులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. గతంలో చేసిన తొమ్మిది ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల సమర్పించారు. దొంగ ఓట్ల నమోదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారన్నారు. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలన్నారు. ఇంటి నెంబర్ లేకుండా నమోదైన ఓట్లను వెంటనే తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాత తుది జాబితాను విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను తుమ్మల ఈసీకి అందించారు.
tummala nageswara rao
cec
Congress
Telangana Assembly Election

More Telugu News