Asaduddin Owaisi: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi announces Jubilee Hills MLA candidate
  • మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను జూబ్లీహిల్స్  అభ్యర్థిగా ప్రకటించిన అధినేత
  • షేక్ పేట కార్పోరేటర్‌గా ఉన్న మహమ్మద్ రషీద్  
  • బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి తమ పార్టీ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా అభ్యర్థి పేరును ప్రకటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మ‌హ‌మ్మ‌ద్ ర‌షీద్ ఫ‌రాజుద్దీన్ పోటీలో ఉండ‌నున్న‌ట్లు అస‌దుద్దీన్ ప్ర‌క‌టించారు. ఈ స్థానం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ త‌ర‌పున టీమిండియా మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. మ‌హ‌మ్మ‌ద్ ర‌షీద్ ఫ‌రాజుద్దీన్ షేక్‌పేట కార్పొరేట‌ర్‌గా ఉన్నారు. హైద‌రాబాద్‌లో మజ్లిస్ పార్టీ మొత్తం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తోంది.

  • Loading...

More Telugu News