Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 595 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 181 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంతో 64,959కి ఎగబాకింది. నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 19,412 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.30%), యాక్సిస్ బ్యాంక్ (2.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.88%), టాటా స్టీల్ (1.79%).      
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.65%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.29%), టాటా మోటార్స్ (-0.29%), టైటాన్ (-0.19%).

  • Loading...

More Telugu News