Game Changer: రామ్ చ‌ర‌ణ్‌ ‘గేమ్ చేంజర్’ పాట లీక్... ఇద్దరి అరెస్ట్

Police arrests tow persons involved in Game Changer song leakage
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • ఈ చిత్రం నుంచి ఓ పాట లీక్
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
  • లీక్ చేసిన వ్యక్తులను గుర్తించిన పోలీసులు
గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

కాగా, 'గేమ్ చేంజర్' సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ చాంద్ భాషా, ఎస్సై  భాస్కర్ రెడ్డి, ప్రసేన్ రెడ్డి, సాయి తేజ్ తో కూడిన బృందం ఈ కేసును ఛేదించింది. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.
Game Changer
Ram Charan
Song
Leak
Cyber Crime
Shankar
Tollywood
Kollywood

More Telugu News