Ambati Rambabu: విలువలు లేని మీకే ఇది సాధ్యం: అంబటి రాంబాబు

Pawan Kalyan has no values says Ambati Rambabu
  • మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన అంబటి
  • ఏపీలో టీడీపీతో, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విమర్శలు
  • ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు. 

ఇంకోవైపు, తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ... 8 స్థానాలను మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే, హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. 

ఇదిలావుంచితే, వైద్య చికిత్సల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో, చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
Ambati Rambabu
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News