Betting Apps: అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా

Center blocks illegal betting apps and websites
షార్ట్స్‌లో చూడండి
దేశంలో అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిశ్చయించింది. ఈ నేపథ్యంలో, పలు అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. 22 బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్ల కార్యకలాపాలను కేంద్రం బ్లాక్ చేసింది. కేంద్రం బ్లాక్ చేసిన యాప్ ల జాబితాలో ఇటీవల కలకలం రేపిన మహదేవ్ బుక్ బెట్టింగ్ యాప్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్ ల కార్యకలాపాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు తర్వాత కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. ఛత్తీస్ గఢ్ లో మహదేవ్ బుక్ యాప్ అక్రమాలకు పాల్పడుతోందని ఐటీ శాఖ వెల్లడించింది.
Go Back to Shorts
Betting Apps
Websites
Center
India

More Telugu News