Anushka Sharma: కోహ్లీ బర్త్ డే... అనుష్క ఎలా విష్ చేసిందంటే...!

Anushka Sharmas special birthday message for Virat Kohli
  • భావోద్వేగంతో కూడిన పోస్ట్ తో విషెస్ తెలిపిన అనుష్క
  • ఈ జీవితమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ వెల్లడి
  • తన లైఫ్ లో కోహ్లీ ప్రాముఖ్యతను.. భర్తపై తనకున్న ప్రేమను చాటిచెప్పేలా పోస్ట్
బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీకి అభిమానులు, క్రికెట్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు 35 వ బర్త్ డే జరుపుకుంటున్న కోహ్లీకి సోషల్ మీడియా వేదికగా చాలా మంది విషెస్ చెబుతున్నారు. కోహ్లీతో తమకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా పోస్ట్ లు పెడుతున్నారు. కోహ్లీ సతీమణి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇన్ స్టా వేదికగా భర్తకు విషెస్ తెలిపింది. సంప్రదాయబద్ధంగా పుట్టిన రోజు శుభాకాంక్షలనే మాట వాడకుండా భావోద్వేగపు పోస్ట్ పెట్టింది. క్రికెటర్ గా కోహ్లీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. అతడిపై తనకున్న ప్రేమకు అక్షరరూపమిచ్చింది.

తన జీవితంలో కోహ్లీ ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ అనుష్క ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తామిద్దరూ కలిసి ఉన్న ఫొటోను యాడ్ చేసింది. కోహ్లీ నిజంగా అసాధారణమైన వ్యక్తి అని కితాబిచ్చింది. కొడుకుగా, భర్తగా, తండ్రిగా.. అన్ని పాత్రలలోనూ అసాధారణమేనంటూ పొగిడింది. ఈ జన్మంతా.. ఆ తర్వాత కూడా నీపై నాకున్న ప్రేమకు అంతులేదంటూ అనుష్క పేర్కొంది.
Anushka Sharma
Virat Kohli
Birthday kohli
Instagram
anushka emotional
birthday wishes

More Telugu News