Team India: నేడు సఫారీలతో సై... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss and elected bat first against South Africa
  • వరల్డ్ కప్ లో టీమిండియా × దక్షిణాఫ్రికా
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • ఇప్పటికే సెమీస్ చేరిన టీమిండియా, దక్షిణాఫ్రికా

వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియాకు నేడు సిసలైన సవాలు ఎదురుకానుంది. ఇవాళ రోహిత్ సేన బలమైన దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. 

టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఏడింట్లోనూ గెలవగా, దక్షిణాఫ్రికా 7 మ్యాచ్ లు ఆడి 6 గెలిచింది. రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. నేటి మ్యాచ్ ద్వారా టోర్నీ లీగ్ దశలో ఆధిపత్యం ఎవరిదో స్పష్టం కానుంది. అంతేకాదు, పాయింట్ల పట్టికలో ఎవరి స్థానం ఎక్కడన్నది తేలనుంది.

కాగా, ఇవాళ్టి మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇప్పటికే సెమీస్ చేరినప్పటికీ, వరుసగా విజయాలు సాధిస్తున్న జట్టులో మార్పులు చేయదలుచుకోలేదని చెప్పాడు. 

అటు, దక్షిణాఫ్రికా జట్టులో ఫామ్ లో ఉన్న పేసర్ గెరాల్డ్ కోట్జీ స్థానంలో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ జట్టులోకి వచ్చాడు.

  • Loading...

More Telugu News