medigadda: మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై నీటిపారుదల శాఖ సమీక్ష

TS officials review on dam safty authority report
  • ఈఎన్సీలు, ఇంజినీర్లతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష
  • మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగుబాటుపై నివేదిక ఇచ్చిన జాతీయ అథారిటీ
  • సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలపై తగిన సమాధానం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగుబాటును పరిశీలించిన అనంతరం జాతీయ అథారిటీ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలపై తగిన వివరాలతో సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈఎన్సీలు, ఇంజినీర్లతో ఆయన సమావేశమై, ఎన్ఎస్డీ నివేదికలో లేవనెత్తిన అంశాలపై వివరంగా చర్చించారు. నివేదికలో పేర్కొన్న అంశాలు, ఆరోపణలకు తగిన వివరాలతో సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు.
medigadda
kaleswaram project
Telangana

More Telugu News