Gone Prakash Rao: షర్మిలను విమర్శించొద్దు: హరీశ్ రావుపై గోనె ప్రకాశ్ రావు ఫైర్

Dont criticise YS Sharmila says  Gone Prakash Rao
  • ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న
  • ఏపీలో పోటీ చేస్తారా, లేదా? చెప్పాలని డిమాండ్
  • టీడీపీ, సీపీఎంలతో కేసీఆర్ పొత్తు పెట్టుకోలేదా? అని ఎద్దేవా
జాతీయ పార్టీగా ఎదుగుతామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. షర్మిల పోటీ చేయకపోవడాన్ని విమర్శిస్తున్న మీరు ఇతర ప్రాంతాల్లో ఎందుకు పోటీ చేయడం లేదని అన్నారు. మహారాష్ట్ర, ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా, లేదా? చెప్పాలని హరీశ్ ను డిమాండ్ చేశారు. షర్మిల సరైన నిర్ణయం తీసుకున్నారని... ఆమెను విమర్శించడం హరీశ్ కు తగదని చెప్పారు. తెలంగాణను విమర్శించిన టీడీపీ, సీపీఎంలతో కేసీఆర్ పొత్తు పెట్టుకోలేదా? అని ఎద్దేవా చేశారు. 

Gone Prakash Rao
YS Sharmila
YSRTP
Harish Rao
BRS

More Telugu News